అత్యంత వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రతం

994చూసినవారు
వరంగల్ కాశీబుగ్గలోని ప్రసిద్ధ రంగనాయక స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో ఎన్ వెంకట్రావు, దేవాలయ అభివృద్ధి కమిటీ పూర్వ అధ్యక్షులు వంగరి రవి, ఆలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, మంచాల సృజన, సుల్తానా సమ్మక్క, కూరపాటి రోజా, మౌటం శ్రీనివాస్, తలకోటి రమేష్ దంపతులు, చల్లా నాగరాజు దంపతులు, గడ్డం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్రతం పౌర్ణమి పర్వదినాన దేవాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.