మే 24న అర్దరాత్రి హంటర్ రోడ్డులోని రామన్నపేట నాలా జంక్షన్లో పాత కక్షలను మనస్సులో పెట్టుకొని బతుక ఉత్తమ్ కుమార్, అతడి మిత్రులపై కత్తులు, కర్రలు, ఖాళీ బీరు సీసాలతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఉత్తమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. పోతననగర్లోని మోడ్రన్ దోబీఘాట్ వద్ద నిందితులు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సలివేరు చందు, మిద్దెపాక అభి నంద్ (సిద్ధు), మహ్మద్ గౌస్ ఖాన్ (అబ్బు), మిద్దెపాక పాల్సన్, చెరుకు శివసాయి, ఎరుకొండ వినయ్ లను అదుపులోకి తీసుకున్నారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.