వరంగల్‌లో చిరు వ్యాపారుల ధర్నా

1చూసినవారు
వరంగల్ నగరంలో జీవనోపాధిని కోల్పోయిన చిరు వ్యాపారులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల చర్యలకు నిరసనగా రోడ్డెక్కారు. ఇటీవల సీకేఎం హాస్పిటల్ నుండి హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఉన్న దుకాణాలను అధికారులు అర్ధాంతరంగా తొలగించడంతో, చిరు వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. తమకు శాశ్వత స్థలాలు కేటాయించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గజ్జెల లింగమూర్తి మాట్లాడుతూ, 'ఎండనక, వాననక రెక్కాడితే గాని డొక్కాడని పేదలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్