ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ లక్ష్యంగా వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల ఇళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేపట్టిన ఈ తనిఖీల్లో, వారి ప్రస్తుత నివాస స్థితి, రోజువారీ కార్యకలాపాలు, జీవన విధానాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వారు స్థానికంగానే ఉంటున్నారా లేదా అని నిర్ధారించుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, పాత నేరస్థుల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.