నిరుద్యోగులైన యువతకు ఒక మంచి అవకాశం రాజీవ్ యువ వికాసం పథకమని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడ్ అన్నారు. సోమవారం వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయాన్ని కమిషనర్ ఆకస్మికంగా సందర్శించి సెలవు రోజున ప్రత్యేక కౌంటర్ ద్వారా స్వీకరిస్తున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించాలన్నారు. ఆదివారం స్వీకరించిన దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు.