పర్యావరణవేత్త, నీటి హక్కుల ఉద్యమకారుడు దుశర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణను మంత్రి సురేఖ పరామర్శించి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి గురైన సత్యనారాయణ శరీరం విధ్వంసానికి గురైన అడవిని తలపిస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.