వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం 3 & 4 వద్ద GRP, RPF అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన కర్నూలు జిల్లా నంద్యాల మండలం కన్నాల గ్రామానికి చెందిన కేతేపల్లి హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగిలించిన ₹9, 50,000 విలువైన 60.262 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో, స్వాధీనం చేసుకున్న సొమ్మును సీజ్ చేసి, అతడిని రిమాండ్‌కు తరలించారు.