వరంగల్‌లో విషాదం: అదృశ్యమైన వృద్ధురాలు విగతజీవిగా లభ్యం

0చూసినవారు
వరంగల్‌లో విషాదం: అదృశ్యమైన వృద్ధురాలు విగతజీవిగా లభ్యం
వరంగల్ నగరంలో గత నెల 23న అదృశ్యమైన 65 ఏళ్ల మహ్మద్ ఖైరున్నీసా అనే వృద్ధురాలు చింతల్ కల్లు మండువ సమీపంలోని తుమ్మపొదల్లో విగతజీవిగా లభ్యమయ్యారు. ఈ ఘటనతో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న అజాం జాహి మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సీఐ కర్రె స్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. ఈ మరణం హత్యనా లేక ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్