వరంగల్ ఉర్సు దర్గా వద్ద ధ్వంసమైన పూలే విగ్రహం స్థానంలో మహాత్మా జ్యోతిరావు, సావిత్రీబాయి పూలే కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసే పనులను ఓ వర్గానికి చెందిన వ్యక్తులు, విగ్రహ కమిటీ, బీసీ సంఘాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సయోధ్య కుదరకపోవడంతో విగ్రహాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.