2025వ సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో వరంగల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు జిల్లా అధికారులు కలసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఉద్యోగులందరూ నూతన ఉత్సాహంతో పని చేస్తూ జిల్లాను రాష్ట్రంలో అగ్రభాగంలో ఉంచాలని కలెక్టర్ తెలిపారు.