వరంగల్: భద్రకాళి అమ్మవారి భక్తులకు కీలక సూచన

71చూసినవారు
వరంగల్ భద్రకాళి ఆలయానికి వచ్చే భక్తులకు ఈవో శేషుభారతి శుక్రవారం కీలక సూచనలు చేశారు. ఈ నెల 8, 9, 10న ఆలయంలో ప్రదక్షిణలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీన అమ్మవారి కోసం 20 వేల మంది ర్యాలీగా కూరగాయలు తీసుకువస్తారని పేర్కొన్నారు. అమ్మవారిని అలంకరించే క్రమంలో ఆలయ ప్రాంగణం మొత్తం నిండుగా ఉంటుందని.. ప్రదక్షిణలు నిలిపివేస్తున్నట్లు వివరించారు. భక్తులు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you