వరంగల్‌లోని 34వ డివిజన్ శివనగర్‌కు చెందిన సరోజన(65) ఎండల తీవ్రతకు వడదెబ్బ తగిలి బుధవారం మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను
బీజేపీ శివనగర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, బోడకుంట్ల శివశంకర్, అరుణ్ కుమార్, ఉషారాణి తదితరులు పరామర్శించి, నివాళులర్పించారు.