
ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రశాంతం: DIEO శ్రీధర్ సుమన్ అభినందన
జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో విజయవంతంగా ముగిశాయి. ఈ నెల 2న ప్రారంభమైన పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పూర్తయ్యాయని DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. చివరి రోజున 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసిన చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపక బృందాన్ని ఆయన అభినందించారు.


































