హనుమకొండ జిల్లా కాజిపేటలో పేకాట ఆడుతున్న 12మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశాంత్ నగర్ కాలనీలో జరిగిన ఈ దాడిలో, వారి వద్ద నుంచి 2,06,860 రూపాయల నగదుతో పాటు 12 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం వీరిని కాజిపేట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.