హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 162 ఫిర్యాదులు అందినట్లు జిల్లా అదనపు కలెక్టర్ రవి తెలిపారు. ఈ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలు, ట్రైనీ ఐఏఎస్ సాయి శివానీలకు ఆయన ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ఒక ముఖ్య వేదిక అని, అధికారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.