హనుమకొండ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 222 అర్జీలు అందాయి. గృహ నిర్మాణం, రెవెన్యూ, పౌరసరఫరాలు, విద్య, మున్సిపల్, పంచాయతీ, ఆర్&బి, మెప్మా వంటి వివిధ శాఖలకు సంబంధించిన ఈ అర్జీలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.