వరంగల్: కేఎంసీకి 6 నెలల మృత పిండం వైద్యవిద్య నిమిత్తం దానం

82చూసినవారు
వరంగల్: కేఎంసీకి 6 నెలల మృత పిండం వైద్యవిద్య నిమిత్తం దానం
వరంగల్ రైల్వే గేట్ నివాసి వజిన పెల్లి భావన తన గర్భంలో పెరుగుతున్న 6 నెలల పిండంలో ప్రమాదమైన వ్యాధిని గుర్తించిన వైద్యులు, తల్లికి అపాయం జరుగుతుందని గుర్తించి, పిండాన్ని తొలగించారు. తల్లిదండ్రులు సమాజ హితం కోరి కేఎంసీకి వైద్య విద్యకు దానం చేయడానికి ముందుకు రాగ ‘తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి ఆదేశంతో అనాటమీకి పిండాన్ని అప్పగించారు.