శ్రీవిద్య ఆత్మహత్య కేసులో 6 విద్యార్థులపై సస్పెన్షన్ వేటు

0చూసినవారు
శ్రీవిద్య ఆత్మహత్య కేసులో 6 విద్యార్థులపై సస్పెన్షన్ వేటు
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఎంఎస్సీ (ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) సెకండియర్ విద్యార్థిని పి. శ్రీవిద్య ఆత్మహత్య ఘటనలో ఆరుగురు విద్యార్థినులపై కేయూ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఒక సెమిస్టర్ వరకు వారిని సస్పెండ్ చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీవిద్య, ఆరుగురు సీనియర్లు తనపై దొంగతనం మోపి, రూమ్ లో వేసి చితకబాదారని ఆరోపిస్తూ మార్చి 16న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె చనిపోయే ముందు ఆస్పత్రిలో ఆరుగురు సీనియర్ల పేర్లను వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్