హనుమకొండలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ప్రారంభం

3చూసినవారు
హనుమకొండలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ప్రారంభం
హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి టోర్నమెంట్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల పెంచేందుకు క్రీడలు దోహదపడతాయని ఆయన తెలిపారు. సుమారు 2,000 మంది విద్యార్థి క్రీడాకారులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలు ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధన్నపేట, వరంగల్ (వెస్ట్) పరిధిలో జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్