2026 కొత్త సంవత్సరం రెండవ రోజున, వరంగల్ నగరం దట్టమైన మంచుతో కప్పబడి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ప్రభాత వేళ కురిసిన మంచుతో చలి తీవ్రమైంది. మంచులో తడుస్తూనే ప్రజలు వాకింగ్ చేశారు. దట్టమైన మంచు కారణంగా 100 మీటర్ల దూరంలోని వస్తువులు కూడా కనిపించలేదు. రహదారులపై వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.