వరంగల్ పోలీస్ కమిషనరేట్లో జాతిపిత మహాత్మా గాంధీజీ 154వ జయంతి సందర్భంగా శుక్రవారం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను ఆచరిస్తూ శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ధార కవిత, అదనపు డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.