ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


దేశవ్యాప్తంగా ఒకే రమైన అంబులెన్స్ సేవలు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
Jun 30, 2026, 03:06 IST/

దేశవ్యాప్తంగా ఒకే రమైన అంబులెన్స్ సేవలు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

Jun 30, 2026, 03:06 IST
దేశంలో అత్యవసర వైద్య సేవలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం, కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా 'జాతీయ అంబులెన్స్ సేవ (ఎన్ఏఎస్)–2026' మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ మార్గదర్శకాల ప్రకారం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలు ఒకే ప్రమాణాలతో నిర్వహించబడతాయి. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా సేవలు విస్తరించేలా జీపీఎస్ ట్రాకింగ్, 112 నంబర్‌తో అనుసంధానం, ఏఐఎస్–125 ప్రమాణాలకు అనుగుణంగా అంబులెన్స్‌ల తయారీ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య రవాణా సేవలు అందించడమే ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం.