మడికొండ చౌరస్తాలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

7చూసినవారు
మడికొండ చౌరస్తాలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వేడుకలను ఆదివారము ఘనంగా నిర్వహించారు. మడికొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిల్లా రవీందర్, జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కామని మల్లేష్ మాట్లాడుతూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు సామాజిక సేవ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వంగ రమేష్, నల్ల సురేష్, పోతరాజు ప్రకాష్, తాటిపాముల సత్యనారాయణ, సారంగపాణి, సదానందం, వెంకటేశ్వర్లు, హేమంత్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్