హన్మకొండలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి వేడుకలు సోమవారం అంబేద్కర్ కూడలిలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బుచ్చ ఆనందం, ప్రధాన కార్యదర్శి కామిని మల్లేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మడికొండ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిల్లా రవీందర్, పరపతి సంఘం ఉపాధ్యక్షుడు నల్ల హేమంత్, పోతరాజు ప్రకాష్, కందకట్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు.