హనుమకొండ నగరంలోని చికెన్ సెంటర్లలో కోడి మాంసాన్ని శుభ్రం చేసేటప్పుడు పసుపుకు బదులుగా కృత్రిమ రంగులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు. ఆయన పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. రసాయన రంగులు కలిపిన మాంసం తింటే ఉదర, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. వీరిపై కఠినచర్యలకు వెనుకాడబోమని ఆయన అన్నారు.