అదనపు డీసీపీ పనితీరు అభినందనీయం: సీపీ

0చూసినవారు
అదనపు డీసీపీ పనితీరు అభినందనీయం: సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ పనితీరును అభినందించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న అడిషనల్ డీసీపీకి స్థానిక కేయుసి ప్రాంతంలోని వి. యం. కళ్యాణ వేదికలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని, పదవీ విరమణ చేస్తున్న అధికారిని ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పరిపాలన విభాగం సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్