ములుగు ఏఆర్ అడిషనల్ ఎస్పీ సదానందానికి శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి బయటకు వస్తున్న ఆయన కారును బండారుపల్లి నుంచి ములుగు వైపు వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. అడిషనల్ ఎస్పీ, డ్రైవర్, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.