
రాష్ట్రాలకు రాజధాని అవసరం లేదు: జగన్
సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వంటి నాయకుడు ఏపీకి ఉండటం దురదృష్టకరమని, ఆయనకు చిత్తశుద్ధి, నిజాయితీ లేదని ఆరోపించారు. దోపిడీ చేయడమే చంద్రబాబు పని అని, అమరావతికి చట్టబద్ధత బిల్లు విషయంలోనూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగంలో రాష్ట్రానికి రాజధాని అనే పదం లేదని, రాష్ట్ర రాజధాని కేవలం ప్రభుత్వ ఇష్టమని, ఈ విషయంలో కేంద్రం పాత్ర ఉండదని, తీర్మానం పేరుతో డ్రామాలు ఎందుకని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రాలకు రాజధాని అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.




