ఏప్రిల్ 30వ తేదీన శ్రీ నరసింహ స్వామి జయంతి

1చూసినవారు
ఏప్రిల్ 30వ తేదీన జరగనున్న శ్రీ నరసింహ స్వామి జయంతి విజయవంతం చేయాలని శ్రీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సేవా సమితి కార్య నిర్వహకులు రాము పిలుపునిచ్చారు. వరంగల్ భద్రకాళి రోడ్ లో గల శ్రీ సింహాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈనెల 30వ తేదీ జరగనున్న స్వామి వారి జయంతి ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధి చతుర్థి స్వాతి నక్షత్రమున శ్రీ నరసింహ స్వామి జయంతి మహోత్సవములు నిర్వహిస్తున్నామని ఉదయం ఏడు గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘట్టాభిషేకం 108 కళాశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్