వరంగల్ 40వ డివిజన్, ఉర్సు ప్రాంతానికి చెందిన చీర భరత్ కుమార్, సామాజిక సేవ, జర్నలిజంలో చేసిన సేవలకు గాను ప్రపంచ జానపద దినోత్సవం రోజున మదర్ తెరిసా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కురుమ సంఘం నాయకులు మంగళవారం ఆయనను ఘనంగా సన్మానించారు. భరత్ కుమార్ కురుమ కుల అభివృద్ధికి, రాజకీయంగా ఎదగడానికి కృషి చేయాలని సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఎనలేని సేవలు అందిస్తూ అవార్డు అందుకోవడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని మండల నరసింహ రాములు అన్నారు.