కాజీపేటలోని శ్వేతార్క మూలగణపతి దేవాలయంలో కార్తీక మాసోత్సవ వేడుకల్లో భాగంగా అయ్యప్ప స్వామి మాలధారణ కార్యక్రమం వైభవంగా జరిగింది. శబరిమల మండల పూజలకు వెళ్లే భక్తుల కోసం ఆలయ వ్యవస్థాపకులు ఐనవోలు అనంత మల్లయ్యశర్మ సిద్దాంతి మాలధారణ చేశారు. ఈ కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చింది.