హన్మకొండ నాయింనగర్ లోని లక్ష్మి నరసింహ హాస్పిటల్ లో ఆపరేషన్ వికటించి ఒక బాబు మరణించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని దాచి, నాలుగు రోజులుగా మోసం చేస్తున్నారని వారు ఆరోపిస్తూ, ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. తమ తప్పిదం లేదని వైద్యులు, సిబ్బంది దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.