బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొక్కల గడ్డలోని ఈద్గా మైదానాన్ని సందర్శించి, ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. బక్రీద్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వం, త్యాగానికి ప్రతీక అని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.