బల్దియా నిర్లక్ష్యం.. చినిగిపోయిన జాతీయ పతాకం

2చూసినవారు
బల్దియా నిర్లక్ష్యం.. చినిగిపోయిన జాతీయ పతాకం
వరంగల్‌లోని భద్రకాళి బండ్ – పోతననగర్ మార్గంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకం, ఈదురుగాలుల కారణంగా తలక్రిందులై కంబానికి ఇరుక్కుపోయింది. శుక్రవారం చినిగిపోయిన ఈ సంఘటన స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. జాతీయ గౌరవానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకం ఇలా ఉండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి కొత్త జెండాను కట్టి, మళ్లీ రెపరెపలాడేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్