బాపూజీ సేవలు యువతకు స్ఫూర్తి.. న్యాయవాదులు

903చూసినవారు
బాపూజీ సేవలు యువతకు స్ఫూర్తి.. న్యాయవాదులు
హనుమకొండలో ఆదివారం అంబేద్కర్ హాల్‌లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు చోళ్ళేటి రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ కోసం బాపూజీ చేసిన త్యాగాలు, సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. బాపూజీ సేవలు యువతకు స్ఫూర్తినిస్తాయని న్యాయవాదులు కొనియాడారు.

సంబంధిత పోస్ట్