హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో న్యాయవాది షేక్ అఖీల్ జునైద్, మహిళా న్యాయవాది ఫిజాషా పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండలో బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ నిరసన తెలిపారు. పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.