వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. ఉదయం ఏడు గంటలకు నిత్యపూజలు ముగిసిన వెంటనే ఆలయాన్ని మూసివేసినట్లు అర్చకులు తెలిపారు. గ్రహణం పూర్తయి, ఆలయ శుద్ధి ప్రక్రియల అనంతరం బుధవారం ఉదయం నుండి భక్తులకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుందని వారు వెల్లడించారు.