వరంగల్ మహానగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళీ దేవస్థానంలో శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి డోలోత్సవం నిర్వహించారు. ఉదయం భద్రపీఠ సేవ, సాయంకాలం అశ్వవాహన సేవపై అమ్మవారిని ఊరేగించారు. బ్రహ్మోత్సవాలలో అఖిల భారత పద్మశాలి సంఘం, వరంగల్, హనుమకొండ జిల్లాల గ్రేటర్ వరంగల్ వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. పద్మశాలి కుల సంఘం ఆహ్వానం మేరకు నగర మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.