కేంద్ర గ్రంథాలయంలో భరోసా కేంద్రం అవగాహన సదస్సు

9చూసినవారు
కేంద్ర గ్రంథాలయంలో భరోసా కేంద్రం అవగాహన సదస్సు
ప్రజాపాలన ప్రగతి ప్రణాలికలో భాగంగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ భరోసా కేంద్రం సిబ్బంది హనుమకొండలోని కేంద్ర గ్రంథాలయం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్, ఐడియల్ బ్యూటీ అకాడమీలలో మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భరోసా సేవలు, పితృస్వామ్యం, స్త్రీ ద్వేషం, లైంగిక దోపిడీ, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక వేధింపులు, సైబర్ స్టాకింగ్, సైబర్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, బాలల హెల్ప్‌లైన్-1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్-1930 వంటి అంశాలపై వివరించారు.

సంబంధిత పోస్ట్