నేడు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సిన్హా రాక

0చూసినవారు
నేడు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సిన్హా రాక
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సిన్హా నేడు వరంగల్ పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 1:00 గంటలకు హరిత హోటల్‌కు చేరుకుని, 150 మంది గిరిజన ప్రతినిధులతో సమావేశమై, వారితో కలిసి సమపంక్తి భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులు, ఏజెంట్లతో భారీ సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం భద్రకాళి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్