శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వరంగల్, హన్మకొండ కోర్టు ఆవరణంలోని అమ్మవారి ఆలయంలో బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా బోనాలు నిర్వహించారు. మహిళా న్యాయవాదులు బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.