విద్యార్థుల సమస్యలపై పరిష్కారానికి బీఆర్ఎస్వీ పోరాటం
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను హనుమకొండ జిల్లా కో ఆర్డినేటర్ గండ్రకోట రాకేష్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. 8 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
