వరంగల్ లో రేపు అద్దె బస్సుల బంద్

3చూసినవారు
గురువారం వరంగల్ 1 & 2 డిపోల అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మెకు పిలుపునిచ్చారు. వేతనాల పెంపు విషయంలో యజమానుల మొండివైఖరిని నిరసిస్తూ, నెలకు కనీసం ₹2,600 పెంచాలని డ్రైవర్లు కోరుతున్నారు. అయితే, యజమానులు కేవలం ₹1,400 మాత్రమే పెంచుతామని తెగేసి చెప్పారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్వయంగా మాట్లాడినా, యజమానులు దిగిరాకపోవడంతో, బస్సులను స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు డ్రైవర్లు తెలిపారు.

ట్యాగ్స్ :