కాజీపేటలో యువతిపై కెమికల్ దాడి

4చూసినవారు
కాజీపేటలో యువతిపై కెమికల్ దాడి
కాజీపేట కడిపికొండ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సునంద (21) అనే యువతిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కెమికల్ రసాయనంతో దాడి చేశారు. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, బంధువులు వెంటనే ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జాఫర్గడ్ వెంకటాపురం గ్రామానికి చెందిన సునందపై జరిగిన ఈ దాడిపై పోలీసులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :