మడికొండలో కోళ్ల దొంగల హల్చల్ వైఫల్యంపై విమర్శ

564చూసినవారు
మడికొండలో కోళ్ల దొంగల హల్చల్ వైఫల్యంపై విమర్శ
కాజీపేట మండలం, మడికొండ పరిధిలో గత మూడు రోజులుగా కోళ్ల దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తెల్లవారుజామున బైక్‌లపై వస్తున్న దుండగులు నాటు కోళ్లను ఎత్తుకెళ్తున్నారు. వరుస చోరీలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతుండగా, అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి గస్తీలో వైఫల్యం వల్లే దొంగలు రెచ్చిపోతున్నారని, నిఘా పెంచి వారిని పట్టుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్