కాజీపేట మండలం హంటర్ రోడ్ శాయంపేటలోని సర్వే నెంబర్ 306/బి లో ఆడేపు రాజేష్ కుటుంబానికి చెందిన 564 గజాల భూమిని రిటైర్డ్ ఆర్డీవో సురేందర్ రెడ్డి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ విషయమై ప్రజాసంఘాల నాయకులు సుబేదారి సీఐ రంజిత్ కుమార్ ను కలవడానికి వెళ్లగా, "మీకు ఈ భూమితో ఏం సంబంధం" అని అమర్యాదగా ప్రవర్తించి, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని బెదిరించినట్లు బాధితులు తెలిపారు. ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.