వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వాయిదా పడింది. తుఫాను ప్రభావిత జిల్లాల ఇంచార్జ్ మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి, ప్రజలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు.