హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని వారం రోజుల్లోగా నివేదికలు సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. పంట నష్టానికి ఎకరాకు రూ. 10,000 చొప్పున రైతులకు పరిహారం, ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు రూ. 5 లక్షలు, ఇళ్లు నష్టపోయిన వారికి రూ. 15,000 చొప్పున సహాయం అందించాలని సూచించారు. విభాగాల మధ్య సమన్వయంతో శాశ్వత పరిష్కారాల కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని, నాలాల కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.