హనుమకొండ న్యూ శాయంపేటలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన మౌలిక వసతుల పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆకస్మికంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, బ్లాకులను పరిశీలించి, కల్పించిన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.