శ్రీరామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కలెక్టర్

1చూసినవారు
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండలో వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఎన్పిడీసీఎల్ సిఎండీ శ్రీ వరుణ్ రెడ్డితో కలిసి రెవెన్యూ కాలనీలోని శ్రీరామాలయాన్ని సందర్శించారు. ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొన్న కలెక్టర్ దంపతులు ప్రజల సంక్షేమం, శాంతి, సౌభ్రాతృత్వం కోసం దేవుడిని ప్రార్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్